రుద్రేశ్వరస్వామికి అన్నపూజ | - | Sakshi
Sakshi News home page

రుద్రేశ్వరస్వామికి అన్నపూజ

Aug 3 2026 1:07 AM | Updated on Aug 3 2026 1:07 AM

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ చవితి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల మహాగణపతికి హరిద్రాకుంకుమ విలేపనాభిషేకం, గరికపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శివభక్తుడు వెంకటసాయి ఆనంద విశ్వనాథ్‌ సౌజన్యంతో 51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్ర పఠనంతో రుద్రేశ్వర మహాశివలింగాన్ని రుద్రగణపతిగా అలంకరించి మహాన్నపూజ చేశారు. అనంతరం మహాహారతి, మహానివేదన, నీరాజనమంత్రపుష్పం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పూజా కార్యక్రమాల్లో తెలుగు అకాడమీ చైర్మన్‌ కూరపాటి వెంకటనారాయణ కుటుంబ సభ్యులతో దేవాలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈఓ అనిల్‌కుమార్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement