లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ

జనగామ రూరల్‌: జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా పోలీసు అధికారులు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని సమావేశ హాల్లో ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌త్‌పై జిల్లా పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడ తగిన క్రిమినల్‌ కాంపౌండ్‌ కేసులను త్వరగా పరిష్కరించుకునే విధంగా కోర్టుకు సహకరించాలన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులను పరిష్కారంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శంకర్‌ శ్రీదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి జి శశి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సందీప్‌, ఏసీపీ నర్సయ్య, సీఐలు, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement