దేశం, రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుని వర్షపాతం తీరు ప్రభావితమవుతోంది. ఫలితంగా వర్షాలు సమానంగా కురవకుండా విరామాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలకు సాగునీరు అందించడం కష్టమవుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను ఎంపిక చేసుకోవాలి. జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెలక భూములు అధికంగా ఉన్నందున ఎర్రచెలక భూముల్లో ఆరుతడి పంటలు అనుకూలం. అడవుల నరికివేత, పారిశ్రామిక, వాహన కాలుష్యం పెరగడం కూడా వాతావరణ మార్పులకు కారణమవుతోంది.
– డాక్టర్ బి.అనిల్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
●


