న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026
మరికొద్ది రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెనింగ్‌కు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్‌షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో
‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిపై అవగాహన
పెంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
ఎవరైనా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ –2003, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే జస్టిస్ జువైనల్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్) యాక్ట్ 77, 2015 ప్రకారం కేసులు పెడతారు. జైలుకు పంపడంతోపాటు జరిమానా విధించవచ్చు.


