రఘునాథపల్లి: ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష అనుకూల ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అర్హులైన ఒక్కరూ ఓటు హక్కు కొల్పోకుండా బూత్ స్థాయిలో ఇన్‌చార్జ్‌లుగా ఉండే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటరు జాబితా సవరణ జరిగిన మూడు రాష్ట్రాల్లో ముగ్గురు సీఎంలు ఓడిపోయారని వెల్లడించారు. ఈ నెల 9న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టివిక్రమార్క నియోజకవర్గంలో ఏడు సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపసలు చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నియోజకవర్గ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనివాస్, ట్రేనర్ రాజశేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లకావత్ దన్వంతి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, రాంబాబు, వినయ్‌కుమార్, లావణ్య, నాయకులు పాల్గొన్నారు.
ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి


