● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: ఏడాది లోపు మండలంలోని పాంనూర్‌లో బంజరుమాటు, పర్రె కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో భాగంగా మండలంలోని పాంనూర్‌లో గురువారం నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. పాంనూర్ నుంచి నమిలిగొండ వరకు బీటీ రోడ్డు పనులు చేయిస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోలెపల్లి సంపత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి జయశివకుమార్, మండల ప్రత్యేక అధికారి విక్రమ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంపీఓ నర్సింగరావు, హౌసింగ్ డీఈ చంద్రశేఖర్, ఏఓ చంద్రన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
జఫర్‌గఢ్: రాష్ట్రంలోని ఇంటింటికీ ఉపయోగపడే సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పుగల్లులో జరిగిన సభకు సర్పంచ్ కొడారి సాంబ రాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీహరి హాజరై మాట్లాడారు.. గ్రామంలో ఉన్న రిజర్వాయర్‌కు ఉప్పుగల్లు రిజర్వాయర్‌గా పేరు పెట్టించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయ్‌కుమార్, ఎంపీడీఓ సుమన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ నర్సింగరావు, ఏపీఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు.


