● ఎమ్మెల్యే కడియం శ్రీహరి,
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మే 31 డెడ్‌లైన్‌గా పెట్టుకొని మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పీడీ మాతృ నాయక్, ఆయా మండలాల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవలో నిబద్ధత, పారదర్శకతకు
ప్రాధాన్యం
ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకతే ప్రాధాన్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ ట్రెయినీ గ్రూప్–1 అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఎంలు పాల్గొన్నారు.


