● రూ.31.15కోట్లుగా అంచనాలు విడుదల
● గతేడాదితో పోలిస్తే
రూ.13.49 కోట్లు ెపెంపు
జనగామ: జనగామ మున్సిపాలిటీ 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు విడుదల చేసింది. బడ్జెట్‌లో సాధారణ ఆదాయం, వ్యయం, ప్రారంభం, ముగింపు నిల్వలతో పాటు క్యాపిటల్, వ్యయాలు ఎంత అనే దానిపై వివరించారు. రెండేళ్ల ఆర్థిక సంవత్సరాలను బేరీజు వేస్తూ ఆదాయం, వ్యయాలను సమతుల్యంగా నిర్వహిస్తూ, ముగింపు నిల్వలను స్థిరంగా ఉంచే దిశగా బడ్జెట్ రూపొందించారు. సాధారణ ఆదాయం, వ్యయాలతో పాటు క్యాపిటల్ వ్యయాలకు కూడా గణనీయమైన నిధులను కేటాయిం చారు. ఈనెల 31న(మంగళవారం) పురపాలిక కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరుగనుంది. సమావేశంలో బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం పొందనున్నారు.
పెరుగుతూ..
2024–25లో ఆదాయం అత్యధికంగా రూ.25.33కోట్లు రాగా, 2025–26లో కొంత తగ్గి రూ.18.66కోట్లకు పడిపోయింది. ప్రస్తుత అంచనా బడ్జెట్ 2026–27లో తిరిగి రూ.32.15కోట్లకు పెరిగింది. టాక్స్, నాన్‌టాక్స్ ఆదాయాలతో పాటు గ్రాంట్ల విభాగంలో కూడా గణనీయమైన పెరుగుదల మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా ఉంది. 2025–26తో పోలిస్తే ఈసారి అంచనా బడ్జెట్‌లో రూ.13.49 కోట్లు పెరుగుదల కనిపిస్తోంది.


