డ్రైవింగ్‌లో అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌లో అప్రమత్తత అవసరం

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

ఉచిత కంటి పరీక్ష శిబిరంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

జనగామ: డ్రైవింగ్‌ చేసే సమయంలో డ్రైవర్లకు అప్రమత్తత, జాగ్రత్త అవసరమని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ అన్నారు. పట్టణంలోని విజయ ఫంక్షన్‌ హాల్‌లో ‘అరైవ్‌–అలైవ్‌’(క్షేమంగా ఇంటికి చేరుకోండి) ప్రోగ్రాంలో భాగంగా శ్రీ సరోజినీ కంటి హాస్పిటల్‌, పోలీసు శాఖ సంయుక్తంగా ఆటో, క్యాబ్‌, బస్సు డ్రైవర్లకు నిర్వహించిన ఫాకో, లేజర్‌ సెంటర్‌ ఉచిత కంటి వైద్య శిబిరంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. 40 ఏళ్లు దాటిన ప్రతీ డ్రైవర్‌ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ సీహెచ్‌ సృజన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వంద మందికి పైగా కంటి పరీక్షలు చేయగా, అవసరమైన వారికి ఉచితంగా కళ్ల అద్దాలను డీసీపీ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్‌, చెన్నకేశవులు ఉన్నారు.

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు పాటుపడాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా సస్ట్రో ఆయిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి సహకారంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ద్విచక్రవాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన్‌పూర్‌ సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీ చేతుల మీదుగా 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు ఇతర ఫోర్‌వీలర్‌లలో వెళ్లేవారు సీటుబెల్టు ధరించాలని సూచించారు. అనంతరం పట్టణ కేంద్రంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ భీమ్‌శర్మ, ట్రెయినీ ఐపీఎస్‌ మనీషానెహ్రా, సీఐ జి.వేణు, ఎస్‌ఐలు వినయ్‌కుమార్‌, రాజేష్‌, మనీషా, సస్ట్రో సంస్థ ప్రతినిధి సుబ్బారెడ్డి, పోలీసుసిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

30జెజిఎన్‌052:

30ఎస్టీజీ052–

జనగామలో శిబిరాన్ని ప్రారంభిస్తున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

స్టేషన్‌ ఘన్‌ఫూర్‌లో బైక్‌ ర్యాలీలో డీసీపీ, ఏసీపీ, ట్రెయినీ ఐపీఎస్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement