● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: రోడ్డు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి రహదారి భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవేపై ఐఆర్సీ(ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. హైవేపై అనుమతి లేని హోర్డింగ్‌లు ఉండకూడదన్నారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపులా ఎలాంటి అమ్మకాలు జరగకుండా, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేసి, అందులో అమ్మకాలు నిర్వహించుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్ ఆండ్‌బీ ఈఈ స్వరూప, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, ఎకై ్సజ్ అధికారి అనిత, ఈఈ పీఆర్ శ్రీనివాస రావు, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్, మున్సిపల్ కమిషనర్‌లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు
మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యా, వ్యవసాయ, ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.


