జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం టెక్నోజిల్–2026 సంబురాలు అంబరాన్నంటాయి. టెక్నికల్ ఈవెంట్స్ ప్రాజెక్టు ఎక్స్‌పోలో పీపీటీ ప్రజెంటేషన్‌ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్‌పాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రశేశేఖర్‌రెడ్డి వేడుకలను ప్రారంభించారు. డైరెక్టర్ విజయ్‌పాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే విధంగా గొప్ప ఆలోచనలు చేయాలన్నారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుకు తగిన ఫలితం దక్కేలా కష్టపడాలన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
టెక్నోజిల్‌లో భాగంగా ఫ్యాషన్ షో, నృత్యపోటీలతో సభికులను అలరించారు. గాయకులు ఎండీ హైమత్, మేఘనా నాయుడు ఆలపించిన పాటలు విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాయి. ప్రోగ్రాం కన్వీనర్ పీయూ అనిత, వంశీకృష్ణ, అమరేందర్, స్వప్న ఉన్నారు.


