జనగామ రూరల్: జాతీయ శక్తిని తెలియజేసిన గీతం వందేమాతరం అని ఏబీవీపీ ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అంబాల కిరణ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏకశిల డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచామన్నారు. ఏబీవీపీ వరంగల్ విభాగ్ సంఘటన్ కార్యదర్శి పృథ్వీరాజ్, రిటైర్డ్ కల్నల్ భిక్షపతి, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, హృతిక్ తదితరులు పాల్గొన్నారు.


