అంచనా బడ్జెట్
జనగామ: జనగామ మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో సాధారణ ఆదాయం, వ్య యం, ప్రారంభం, ముగింపు నిల్వలతో పాటు క్యాపిటల్, వ్యయాలు ఎంత అనే దానిపై వివరించారు. మంగళవారం పురపాలిక కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన అంచనా బడ్జెట్ సమావేశం జరిగింది. అంచనా బడ్జెట్‌ను సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి ప్రతిపాదిస్తూ, పలు సూచనలు ఇచ్చారు. అధికారులు, కౌన్సిలర్లు బడ్జెట్ కాపీలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సి లర్లు మారబోయిన పాండు, బుక్క బాలభరద్వాజ్, రామగళ్ల విజయ్, లోకమంతరెడ్డి, మంత్రి సుమలతశ్రీశైలం, బూడిద జ్యోతి, పాముకుంట్ల ప్రసాద్, రజని, అండాలు, అనిత, ఉమ, భాస్కర్ ఉన్నారు.
నిధులు పెంచాలి: బూడిద జ్యోతి
పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల సమస్య పరిష్కారం కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులు నామమాత్రంగా ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ.15లక్షలకు పెంచాలని కౌన్సిల్ జ్యోతి కోరారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల సమస్య ఇబ్బందిగా మారిపోయిందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశానవాటికల అభివృద్ధి కోసం నిధులు తక్కువగా ఉన్నాయని, వీటి శాతం పెంచాలని డిమాండ్ చేశారు. చీటకోడూరు రిజర్వాయర్ ఆధునీకరణ, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం బడ్జెట్ ప్రతిపాదనలో నిధుల శాతం పెంచాల్సి ఉందన్నారు. పార్కుల నిర్వహణ కోసం రూ.20 లక్షల వరకు నిధులు కావాలని, జనరల్ ఫండ్ పెంచుకోవడానికి ఆదాయ మార్గాలను శాసీ్త్రయంగా అన్వేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బడ్జెట్ ఇలా..
2026–27 అంచనా బడ్జెట్ రూ.32.15కోట్లకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. టాక్స్, నాన్‌టాక్స్ ఆదాయాలతో పాటు గ్రాంట్ల విభాగంలో కూడా గణనీయమైన పెరుగుదల మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా ఉంది. 2025–26లో మొత్తం బడ్జెట్ రూ.18కోట్ల39లక్షలతో పోలిస్తే ఈసారి అంచనా బడ్జెట్‌లో రూ.13.49 కోట్లు పెరుగుదల కనిపిస్తోంది. కాగా..31.03.2026 నాటికి అంచనా ముగింపు రూ.8కోట్ల53లక్షలు ఉంది.
2026–27 ఆర్థిక సంవత్సర అంచనాలు
టాక్స్ వనరుల అంచనా (ఆస్తి పన్ను, అసైన్డ్ రెవెన్యూ)
జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం
గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిన అంచనా రూ.13.49 కోట్లు
పట్టణ అభివృద్ధే లక్ష్యం:
చైర్‌పర్సన్ కడకంచి బాలమణి
ఆదాయ వివరాలు:
2026–27:
రెమ్యునరేటివ్, ఎంటర్‌ప్రైజెస్, రెంటల్: రూ.1.60కోట్లు
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం: రూ.45.45లక్షలు
పట్టణ ప్రణాళిక: రూ.4.02కోట్లు
ఇంజనీరింగ్: రూ.88.4లక్షలు
మొత్తం నాన్ టాక్స్ ఆదాయం: రూ.6.42కోట్లు
డిపాజిట్లు–అడ్వాన్సులు:
2026–27లో: రూ.1.70 కోట్లు
టాక్స్, నాన్‌టాక్స్ కలిపి మొత్తం ఆదాయం:
2026–27: రూ.13.48కోట్లు
నాన్‌ప్లాన్ గ్రాంట్లు:
2026–27: 1.50కోట్లు
ప్లాన్ గ్రాంట్లు: రూ.1.58కోట్లు
ఇతర గ్రాంట్లు: రూ.6.01 కోట్లు
మొత్తం గ్రాంట్లు:రూ.9.09 కోట్లు
31.03.2026 నాటికి మిగులు బడ్జెట్ : రూ.8.53కోట్లు
01.04.2027 నాటి ప్రారంభ నిల్వ, 2026–27 సాధారణ ఆదాయం కలుపుకుని: రూ.22.02 కోట్లు
2026–27 సాధారణ వ్యయం:
రూ.13.48 కోట్లు
31.03.2027 నాటికి అంచనా
ముగింపు బడ్జెట్:రూ..853.80 లక్షలు
2026–27 క్యాపిటల్ ఆదాయ, వ్యయాలు: రూ.16.96కోట్లు
టాక్స్, నాన్ టాక్స్ వనరులు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్ ద్వారా వచ్చే గ్రాంట్‌లను విభాగాల వారీగా అంచనా బడ్జెట్‌లో పొందుపరిచారు. అధికారులు చేపట్టిన అంచనాల ప్రకారం ప్రతీ విభాగంలో ఆదాయం సంవత్సరానికొకసారి పెరుగుతూ ఉండటం గమనార్హం.
పట్టణ అభివృద్ధే లక్ష్యం..
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. అంచనా బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. అందరి సహకారంతో ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురావడంతో పాటు వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. పట్టణాన్ని మిగతా ప్రాంతాలకు రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పరిపాలనను మరింత చేరువ చేసే విధంగా ముందుకెళ్తాం. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం.
– కడకంచి బాలమణి, చైర్‌పర్సన్
ఏడాది ఆస్తిపన్ను అసైన్డ్ రెవెన్యూ మొత్తం
2024–25 రూ.2.96కోట్లు రూ.9.05కోట్లు రూ.12.02కోట్లు
2025–26 రూ.4.20కోట్లు – రూ.4.20కోట్లు
2026–27 రూ.7.06కోట్లు – రూ.7.06కోట్లు


