● ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి
జనగామ: జిల్లా పరిధిలో అదనపు డీటీఆర్‌ల మంజూరు కోసం రైతులు ఎవరూ కూడా డబ్బులు ఇవ్వొద్దని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అదనపు డీటీఆర్‌లు ఏర్పాటు చేయడం పూర్తిగా తమ శాఖ పరిధిలోనే ఉంటుందన్నారు. దీనికి సంబంధించి రైతులు, వినియోగదారులు మధ్యవర్తులు, సిబ్బందికి డబ్బులు ఇవ్వరాదని, డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రైతులు, వినియోగదారులు ఎదుర్కొనే ఏ సమస్యలకై నా సంబంధిత సెక్షన్‌న్ అధికారులను నేరుగా సంప్రదించాలన్నారు. అలాగే 1912 హెల్ప్‌లైన్‌న్ ద్వారా కూడా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. రైతులు, వినియోగదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ లేదా సంబంధిత సెక్షన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.
వీధి వ్యాపారులకు
గుర్తింపుకార్డుల అందజేత
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం వీధి వ్యాపారులకు అందించే గుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అన్నారు. ఘన్‌పూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ వాణిశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ మాట్లాడారు. వీధి వ్యాపారులకు మొదటగా రూ.12వేలు బ్యాంకు రుణాలు అందిస్తారని, సకాలంలో చెల్లించిన వారికి అనంతరం రూ.20వేలు, రూ.50వేలు రుణాలను వారి వ్యాపారాల కోసం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
8 వరకు రుణ దరఖాస్తుల గడువు పొడిగింపు
జనగామ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, జనగామ ఆధ్వర్యంలో ఉపాధి కోసం అందించే రుణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీ వీలర్, ఈవీ త్రీ వీలర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ వంటి పథకాలతో పాటు, ఈ సంవత్సరం కొత్తగా పాడి గేదెల పెంపకం పథకాన్ని కూడా చేర్చినట్లు వెల్లడించారు. అర్హులైన షెడ్యూల్డ్ కులం యువకులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఇంటర్‌వర్సిటీ ఖోఖో టోర్నమెంట్‌కు కేయూ ఉమెన్ జట్టు
కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శిరీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు వరంగల్ ఎల్‌బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్‌గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్‌డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.


