ఇండక్షన్‌ స్టవ్‌ల కొరత నిజమే | - | Sakshi
Sakshi News home page

ఇండక్షన్‌ స్టవ్‌ల కొరత నిజమే

Mar 24 2026 8:02 AM | Updated on Mar 24 2026 8:02 AM

గతంలో ఎలక్ట్రిక్‌ స్టవ్‌ల అమ్మకాలు చాలా తక్కువ. గత 15 రోజులుగా ఈ రకం పొయ్యిలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్టాక్‌ క్లోజ్‌ కాగా, ఆర్డర్‌ ఇచ్చి 12 రోజులు గడిచిపోతున్నా రావడం లేదు. స్ప్రింగ్‌ పొయ్యిల సరఫరా పూర్తిగా నిలిచి పోగా, 1500, 2000, 2500 వాట్స్‌ ఇండక్షన్‌ స్టవ్‌ల ధరలు మునుపటి కంటే భారీగా పెరిగాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చినా దొరకడం లేదు.

–కందుకూరి నాగరాజు,

వ్యాపారి, జనగామ

బుకింగ్‌ పెండింగ్‌..

సబ్సిడీ సిలిండర్‌(ఇళ్లలో ఉపయోగించే గ్యాస్‌) సప్లై యథావిధిగా ఉంది. కొరత వస్తుందనే భయంతో చాలా మంది ముందస్తు బుకింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో ఒక్క జనగామ పట్టణంలోనే 4వేల బుకింగ్‌ పెండింగ్‌లో ఉన్నాయి. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా మాత్రం 12 రోజుల క్రితమే నిలిచిపోగా, ఇళ్లలో ఉపయోగించే గ్యాస్‌ మాత్రం రెగ్యులర్‌గా వస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు.

–కాశీనాథ్‌, గ్యాస్‌ ఏజెన్సీ మేనేజర్‌,

జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement