మక్కలు కొనేదెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

మక్కలు కొనేదెప్పుడు?

Mar 24 2026 8:02 AM | Updated on Mar 24 2026 8:02 AM

జనగామ: జిల్లా రైతులు మూడు, నాలుగు రోజులుగా మొక్కజొన్నను మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, జనగామ వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారు.

జిల్లాలో 31,500 ఎకరాల్లో సాగు

జిల్లాలో 31,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ప్రస్తుతం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో రైతులు భారీగా మొక్కజొన్నలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రతీరోజు కనీసం వెయ్యి బస్తాలు చేరుతుండగా, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

క్వింటా మద్దతు ధర రూ.2400

మొక్కజొన్నకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400. అయితే ప్రైవేట్‌ వ్యాపారులు కేవలం రూ.1,700 నుంచి రూ.1800లు మాత్రమే ఆఫర్‌ చేస్తుండటంతో క్వింటాల్‌కు రూ.600 మేర రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌ కాటన్‌ యార్డుకు జిల్లా నలుమూలల నుచి వచ్చిన రైతులు మక్కలను మద్దతు ధరకు అమ్ముకునేందుకు మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో నాలుగు రోజులుగా రైతుల పడిగాపులు

మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం

మద్దతు ధర రూ.2,400..

ప్రైవేటులో రూ.1,800

ఒకటి రెండు రోజుల్లో..

జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. ఒకటి, రెండు రోజుల్లో జనగామ మార్కెట్‌లో కూడా సెంటర్‌ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా మార్కెట్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేయబోతున్నాం.

–రంజిత్‌రెడ్డి, డీఎం, మార్క్‌ఫెడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement