● ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర
స్టేషన్‌ఘన్‌పూర్: పోలీసుశాఖ డీజీపీగా హెచ్‌జే దొర చేసిన సేవలు చిరస్మరణీయమని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర అన్నారు. ఘన్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల రాష్ట్ర నాయకుడు, లిడ్‌క్యాప్ మాజీ మెంబర్ జోగు కుమారస్వామి ఆధ్వర్యంలో ఘన్‌పూర్‌లో సోమవారం హెచ్‌జే దొరకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథిగా హాజరైన మనీషానెహ్ర తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్‌ఐలు వినయ్‌కుమార్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


