
ఆయుర్వేదానికి వెన్నెముక ‘చరకుడు’
జనగామ: ఆయుర్వేదశాస్త్రంలో చరకుడు వెన్నెముక వంటి మహనీయుడని జనగామ వేద ఆయుర్వేద పంచకర్మ వెల్‌నెస్ సెంటర్ డాక్టర్ అంజిరెడ్డి అన్నా రు. మంగళవారం చరక జయంతిని పురస్కరించుకుని దవాఖానాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు చరకుని చిత్రపటానికి పూలమాల వేసి, ప్రత్యేక పూజలు చే శారు. ప్రపంచ వ్యాప్తంగా చరకుడిని జనరల్ మెడిసిన్ పితామహుడిగా పిలుస్తారన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారపు అలవాట్లు, నిత్యందన జీవన ప్రయాణంలో ఎలా ఉండాలనే విషయాన్ని చరక సంహిత గ్రంథంలో పేర్కొన్నారన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.