
కష్టపడే స్వభావం ఉండాలి
జనగామ రూరల్: పిల్లలకు కష్టపడే స్వభావం ఉండాలని పలువురు కవులు, కళాకారులు అన్నారు. ఆ దివారం ఫాదర్స్ డే సందర్భంగా పట్టణంలోని గణేష్‌వాడలో కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్న గొప్పతనం వెలకట్టలేనిదని, ప్రేమ పంచిపెట్టడంలోనూ బరువు బాధ్యతతో కూడిన జీవ నం అనిర్వచనీయమైనదంటూ కవితా గానంలో పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదలకు కష్టపడే స్వభా వం, వ్యక్తిత్వం ఎంతో గొప్పదన్నారు. ఈ కవి సమ్మేళనంలో జి.వై.గిరి ఫౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ, శ్రీశ్రీ కళా వేదిక రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు లగిశెట్టి ప్రభాకర్, అభినందన కల్చరల్ సొసైటీ ఫౌండర్ అయిలా సోమ నర్సింహచారి, కవి హృదయం సాహిత్య వేదిక వ్యవస్థాపకులు పెట్లోజు సోమేశ్వరాచారి, తదితరులు పాల్గొన్నారు.
కవి సమ్మేళనంలో పలువురు కవులు, కళాకారులు