ఘనంగా వార కల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావుల ఆధ్వర్యంలో వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులకు హైదరాబాద్‌కు చెందిన కొండ విష్ణుమూర్తి, శోభారాణి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, అనురాధలు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గణగోని రమేష్, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, భక్తులు పాల్గొన్నారు.


