ఇప్పుడేం చేద్దాం? | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడేం చేద్దాం?

Dec 21 2025 9:38 AM | Updated on Dec 21 2025 9:38 AM

ఇప్పు

ఇప్పుడేం చేద్దాం?

సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం 2020లో పీఏసీఎస్‌ ఎన్నికలు ఇలా..

పీఏసీఎస్‌లకు పర్సన్‌

ఇన్‌చార్జ్‌ల నియామకం

2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్‌ ఎన్నికలకై నా షెడ్యూల్‌ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్‌లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్‌ రూరల్‌ (వరంగల్‌) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్‌ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి.

వరంగల్‌ డీసీసీబీ పర్సన్‌

ఇన్‌చార్జ్‌గా హనుమకొండ

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా హను మకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ను ప్ర భుత్వం నియమించగా ఆమె బా ధ్యతలు స్వీకరించారు.

వైదొలిగిన 99 పీఏసీఎస్‌లు పాలకవర్గాలు.. స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం

మరోసారి పొడిగింపుపై ఆశలు..

రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం

సహకార సంఘాల ఎన్నికలు

జరుగుతాయని ప్రచారం

అన్ని పార్టీల్లో ఎలక్షన్స్‌పై

మళ్లీ మొదలైన చర్చ

ఇప్పుడేం చేద్దాం?1
1/1

ఇప్పుడేం చేద్దాం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement