అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో పనిచేయాల ని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎండీ.గౌసియాబేగం అన్నారు. ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో ఎంఈఓ కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల సముదాయాల సమావేశాన్ని జీసీడీఓ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల సముదాయాల సమావేశాల్లో విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, కఠి నమైన పదాలు, ఒత్తు పదాలు అర్థం చేసుకోవడం, సరళపదాలు, గుణింతాలు, ఒత్తు పదాల బోధన, ఓరల్ రీడింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పూర్తిస్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం సంపత్, ఉపాధ్యాయులు మధుబాబు, రాజేందర్, రమేష్, రాజు, రాము, రజియా, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, వెంకన్న, శ్రీలత, రమేష్, స్వప్న, శిరీష తదితరులు పాల్గొన్నారు.
జఫర్‌గఢ్: విద్యార్థులు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని జీసీడీఓ గౌసియాబేగం కోరారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ని కస్తూర్భా పాఠశాలలో 7 రోజుల ప్రత్యేక శిబిరా న్ని జీసీడీఓ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిహెచ్ స్వప్న అధ్యక్షత జరిగిన సమావేశంలో జీసీడీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్ అడ్వైజర్ మెంబర్ అట్లా రాజు, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
జీసీడీఓ ఎండీ.గౌసియాబేగం


