మధ్యవర్తులతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: మధ్యవర్తులతోనే ఎక్కువ కేసులు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. శనివారం సీనియర్ న్యాయవాదులు, మధ్యవర్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేడు (ఆదివారం) జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తుల పాత్ర ముఖ్యమన్నారు. ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీకి పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, వాహన ప్రమాద కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్‌న్స్ కేసులు ఇందులో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుచరిత, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, జిల్లా సబ్ జడ్జి సుచరిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో స న్మానించి ప్రసాదాన్ని అందజేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ
నేడు లోక్ అదాలత్


