యాప్ వినియోగంపై రైతులకు అవగాహ
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై ప్రతీ మండలంలో మండల స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో యూరియా బుకింగ్ యాప్‌పై సంబంధిత అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాప్ ప్రారంభ దశలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, రైతుల సందేహాలు డీలర్ల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా బుకింగ్ యాప్ వినియోగంలో రైతులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా లేదా ఫిర్యాదులు ఉన్నా హెల్ప్‌లైన్ నంబర్: 8977745512లో సంప్రదించవచ్చన్నారు. అలాగే గ్రౌండింగ్ అయిన అన్ని ఇందిరమ్మ ఇళ్లకు (బేస్‌మెంట్ స్థాయిలో 40 రోజులు, రూఫ్ లెవెల్ స్థాయిలో 50 రోజులు)ఈజీఎస్ చెల్లింపుల కోసం మంజూరు పొందాలని, పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత వాటికి మస్టర్లు రూపొందించి 90 రోజులకు గాను చెల్లింపులు ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలన్నారు.


