యాసంగికి సిద్ధం
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జనగామ రూరల్: జిల్లాలో యాసంగి పంటల సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 2.11లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకుగాను ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గతేడాది యాసంగిలో 1,53,000ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయగా.. ఈ ఏడాది 35వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగనుంది. గత సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి..భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో సాగు అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత వానాకాలంలో వర్షాలు ఆలస్యం రావడంతో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఈనెలలో వరినాట్లు ప్రారంభమై జనవరి మొత్తం సాగనున్నాయి.
వరికే మొగ్గు..
జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 2.11లక్షల ఎకరాల్లో సాగు అంచనా కాగా అందులో వరిపంట 1.89లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 21వేల ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు సాగు కానున్నాయి. రెండో స్థానంలో మొక్కజొన్న 19వేల ఎకరాల్లో, వేరుశనగ పంట వేయి ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన పంటసాగు చేపట్టకుండా..పంటమార్పిడి విధానం పాటించడం వల్ల భూసారం పెరగడంతో పాటు మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
జనగామ మండలంలో నాటుకు సిద్ధమవుతున్న వరి నారు
మొక్కజొన్న
19,500
అవసరమైన ఎరువులు (మె.టన్నుల్లో)..
వరి
ఎకరాలు
1,89,000
వేరుశనగ
1,050
పొగాకు
850
ఎరువులు, విత్తనాల కొరత లేకుండా..
జిల్లాలో యాసంగి పంటలు సాగుచేసే రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సాగు అంచనాకు అనుగుణంగా అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. అన్ని పీఏసీఎస్‌లు, ఆగ్రోస్, ఇతర లైసెన్స్ దుకాణాల్లో రైతులకు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
సన్నాలకు నో చాన్స్..
ఈ యాసంగి సీజన్‌లో ఎక్కువ శాతం రైతులు దొడ్డు రకం వరిసాగుకే మొగ్గు చూపుతారు. సన్నరకం వడ్లను యాసంగిలో రైతులు సాగు చేయడానికి ఇష్టపడరని సన్నరకం వడ్లలో నూకల శాతం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నప్పటికీ.. అధికారుల అంచనా మేరకు యాసంగిలో సన్నాలకు తక్కువ మంది రైతులు మొగ్గు చూపుతారని తెలుస్తుంది.
ప్రణాళికలు సిద్ధం చేశాం..
జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి పంటల సాగు అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేశాం. వర్షాకాలంలో జిల్లాలోని రిజర్వాయర్‌లు, చెరువులు అధిక వర్షాల కారణంగా నిండడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. యాసంగిలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. రైతులు పంటమార్పిడి విధానం పాటిస్తే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది..పంటల సాగులో వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.
– అంబికా సోనీ , డీఏఓ
2.11లక్షల ఎకరాల్లో వివిధ రకాల
పంటల సాగు అంచనా
గతేడాది కంటే ఈసారి పెరగనున్న విస్తీర్ణం
1.89 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం
21వేల ఎకరాల్లో ఇతర పంటలు
రైతులకు అందుబాటులో విత్తనాలు,
ఎరువులు
యాసంగికి సిద్ధం
యాసంగికి సిద్ధం
యాసంగికి సిద్ధం
యాసంగికి సిద్ధం
యాసంగికి సిద్ధం


