హోరాహోరీ
● ఉత్సాహంగా 11వ రాష్ట్రస్థాయి
క్రీడాపోటీలు
జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల(బాలుర)లో 11వ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ అధికారి పర్వతం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి అవసరం అన్నారు. క్రీడలతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసిక దృఢంగా తయారుకావొచ్చన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుందన్నారు. అండర్ –14 విభాగంలో : కబడ్డీ విజేతలు: జోన్–4 మొదటి బహుమతి, జోన్– 5 రెండో బహుమతి గెలిచారు. ఖోఖో విజేతలు: జోన్ –1 మొదటి బహుమతి, జోన్ –7 రెండో బహుమతి గెలిచారు. క్యారం విజేతలు జోన్–4 మొదటి బహుమతి, జోన్ –7 రెండో బహుమతి గెలిచారు. చెస్: జోన్ –2 మొదటి బహుమతి, జోన్ –3 రెండో బహుమతి గెలిచారు. టెన్నికాయిట్: జోన్ –1 మొదటి బహుమతి, జోన్ –5 రెండో బహుమతి గెలిచారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ గుంటి శ్రీనివాస్ పీడీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.కిషన్, వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్ పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
హోరాహోరీ


