ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడలు
జనగామ రూరల్: జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి క్రీడా ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా స్పోర్ట్స్ డిప్యూటీ సెక్రటరీ రుతుమణి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జోనల్ అధికారి విద్యారాణి మాట్లాడుతూ ఓటమి గెలుపునకు నాంది అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, ఎ. నరసింహులు, జి. శ్రీనివాస్, బి.కిషన్, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
20జెజిఎన్ 156:
బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు


