మానవ జాతికి వృక్షాలే ఆధారం
జనగామ రూరల్: మానవ జాతికి వృక్షాలే ఆధారం.. పర్యావరణం పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలి.. ప్లాస్టిక్‌ను నిషేధించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాల సదన్‌ను సందర్శించి బాలికలతో మొక్కలు నాటించారు. చెట్లతో భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పిల్లలతో మొక్కలు నాటించటం వల్ల వారికి సైన్స్‌పై అవగాహన పెరుగుతుందని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంతో భూసారం తగ్గడంతో పాటు అనారోగ్యానికి కారణమతుందని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కె.వేరోనికా, ఎం.కృష్ణవేణి బి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్


