ఆగ్రోస్ సేవా కేంద్రం తనిఖీ
బచ్చన్నపేట: మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రంలో తహసీల్దార్ ఫణికిశోర్, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌రెడ్డి, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్, పెద్ద వంగర ఎస్సై సురేశ్, టాస్క్‌ఫోర్స్ బృందం ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 27 బస్తాల జీలుగ విత్తనాలు తేడారావడంతో ఆగ్రోస్ యజమాని కామిడి శ్రీనివాస్‌రెడ్డి నుంచి ల్యాప్‌టాప్, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, రికార్డు బుక్స్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం ద్వారా అక్రమంగా తరలిస్తున్న జీలుగ విత్తనాలను తొర్రూరు వద్ద అక్కడి పోలీసులు పట్టుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు జీలుగ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాగా షాపు యజమానుల లైసెన్స్ రద్దు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.


