ఆధునికీకరణకు రూ.94.84 లక్షలు
● శ్రీసోమేశ్వర ఆలయానికి నిధులు మంజూరు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, పాల్కురికి సోమనా థ స్మృతి వనం, కల్యాణ మండపం ఆధునికీకరణ పనులకు రూ.94.84 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు. పాలకుర్తి సాంస్కృతిక, వారస త్వ, పర్యాటక సమగ్రాభివృద్ధికి సంబంధించి ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ విభాగం ఈఈ పూనం, డీఈ ఇబ్రహీం బుధవారం విద్యుదీకరణకు సంబంధించి ఎస్టిమెషన్ తయారు చేశారు. శ్రీసోమేశ్వరాలయంలో అంతర్గత విద్యుదీకరణ, గర్భగుడిలో ఏసీలు, గర్బగడి బటయ లైటింగ్‌కు రూ.22 లక్షలు, సోమనాథ స్మృతి వనం విద్యుదీకరణ, లైటింగ్‌కు రూ.21.50 లక్షలు, కల్యాణ మండపం అంతర్గత, బ్యాహ విద్యుదీకరణ, లైటింగ్‌కు రూ. 53.54 లక్షల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ విభాగం ఏఈఈ శృతి, ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


