శైలపుత్రిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

శైలపుత్రిగా అమ్మవారు

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

జగిత్యాలటౌన్‌/ధర్మపురి/రాయికల్‌/జగిత్యాలరూరల్‌/మల్యాల: దేవీనవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శోభాయాత్రగా తీసుకెళ్లి మండపాల్లో ప్రతిష్ఠించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు శైలపుత్రి రూపంలో దర్శనమిచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆలయ ఈవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ అలువాలు శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన వీధుల మీదుగా మేళతాళాలు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు, కోలాటాల మధ్య అమ్మవార్లను మంటపాల్లో ప్రతిష్టించి పూజలు చేశారు. రాయికల్‌లో విశ్వపాలిని సేవా సంఘం కేరళ నుంచి ప్రత్యేక కళాకారులను తెప్పించి ప్రదర్శనలు ఇప్పించింది. మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవి, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. మల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో బాలత్రిపురాసుందరి దేవిగా దర్శనమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement