‘స్లాట్‌’ రిజిస్ట్రేషన్‌ ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

‘స్లాట్‌’ రిజిస్ట్రేషన్‌ ఆలస్యం

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

జగిత్యాల: భూములు క్రయవిక్రయాల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో రైతులు వారివారి అవసరాలను బట్టి భూములు అమ్ముకోవడంగానీ, కొనుగోలుచేయడం గానీ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనే వారికి ఇబ్బందికరంగా మారింది. ఎవరైనా భూమి కొనుగోలుకు ముందు మీసేవకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకుంటారు. ఆ స్లాట్‌ ప్రకారం.. తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎవరైనా స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత వారికి సంబంధించిన భూమి వారిదేనా..? కాదా..? అంటూ విచారణ చేస్తున్నారు. ఒకరు వారి భూమి అని, చుట్టుపక్కల వారిని అడిగి తెలిసిన అనంతరమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక రైతుకు పాస్‌బుక్‌ ఉందంటేనే అతనిదే భూమి అయి ఉంటుంది. ఒకవేళ భూమి లేకున్నా పాస్‌బుక్‌ ఇచ్చారంటే అధికారులదే తప్పిదమే అవుతుంది. నకిలీది అయితే చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ స్లాట్‌ బుక్‌ చేస్తే అన్ని ఒకే ఉంటేనే అవుతాయి. నేరుగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ విధమైన పద్దతి జరగడం లేదు.

విచారణ పేరిట ఇబ్బందులు

రైతులు స్లాట్‌ బుక్‌ చేసిన అనంతరం నేరుగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. కానీ.. స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులను విచారణ పేరిట ఇబ్బందులు చేస్తున్నట్లు తెలిసింది. స్లాట్‌ బుక్‌ అయిన అనంతరం ఈ భూమి వారిదేనా..? కాదా..? అని పరిశీలించడం, లేకుంటే లొసుగులు చూపి అమ్యామ్యాలు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎక్కడాలేని విధంగా విచారణ చేస్తుండటం సమంజసం కాదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు మాత్రం కొన్ని విషయాల్లో గొడవలు జరుగుతున్నాయని, మోకా మీద ఒకరు ఉండి మరొకరు పట్టాకు ఉండటంతో వారు విక్రయి స్తే గొడవలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో విచారణ చేస్తున్నామని పేర్కొంటున్నారు. వాస్తవంగా ఎవరైనా భూమిని కొనుగోలు చేసుకుంటే వారు అన్ని పరిశీలించిన అనంతరమే స్లాట్‌ బుక్‌ చేసుకుంటారు.

నిబంధనల ప్రకారం ప్రక్రియ సాగాలి

భూములపై వివాదాలు, రికార్డుల్లో వ్యత్యాసాలు, చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పుడు విచారణ చేపట్టడం అవసరమే. ఎలాంటి అభ్యంతరాలున్నాయో సంబంధిత రైతులకు స్పష్టంగా తెలియజేస్తే విచారణ కారణాలు, అవసరమైన పత్రాలు తదితర ప్రక్రియపై అధికారులు సమాచారం ఇవ్వాలని రైతులే కోరుతున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న భూమి రిజిస్ట్రేషన్‌ ఆలస్యం కాకుండా పూర్తి చేయాలని కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్లు ఆలస్యం

భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శకం ఉండాలని, ప్రక్రియ తొందరగా కావాలనే ఉద్దేశంతో తహసీల్దార్‌ కార్యాలయాలకు బాధ్యతలు అప్పగించారు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ప్రక్రి య పెద్దగా ఉండేది. ఇప్పుడు అలాంటిది లేకుండా కార్యాలయానికి వెళ్లగానే రిజిస్ట్రేషన్‌ నిమిషాల వ్యవధిలోనే అయ్యేలా మార్పులు తీసుకువచ్చారు.

తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

భూముల క్రయవిక్రయాల్లో రైతులకు తప్పని ఇక్కట్లు

జిల్లాలోని ఓ మండలానికి చెందిన రైతు మరో రైతు వద్ద ఎకరం భూమి కొనేందుకు సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య డబ్బుల ఒప్పందం కూడా కుదిరింది. భూమి కొందామనుకున్న రైతు మీసేవ సెంటర్‌కు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు మాత్రం ఆ భూమి అతనిదేనా..? కాదా..? ఏవైనా సమస్యలు ఉన్నాయా..? అని విచారణ పేరిట కొద్దిరోజులుగా తిప్పుకుంటున్నారు. వాస్తవానికి రైతు పట్టా కలిగి ఉంటే అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే. ఇలా ఒక్క రైతుది కాదు.. విచారణ పేరిట జిల్లావ్యాప్తంగా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement