‘సహకార’ పదవులపై పీటముడి | - | Sakshi
Sakshi News home page

‘సహకార’ పదవులపై పీటముడి

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

● నియోజకవర్గంలో మొత్తం 16 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల మినహా మిగతా మల్లాపూర్‌, ఇబ్రహీపట్నం, మెట్‌పల్లిలో మండలాల్లోని ఏడు సంఘాలను తన వర్గానికి కేటాయించాలని సుజీత్‌రావు పట్టుబట్టుతున్నట్లు తెలిసింది. ● మెట్‌పల్లి, మల్లాపూర్‌, చిట్టాపూర్‌, ముత్యంపేట, తిమ్మాపూర్‌, ఇబ్రహీంపట్నం, సిర్‌పూర్‌లకు ఆయన ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ● జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న సుజీత్‌రావు.. సిర్‌పూర్‌ సంఘం చైర్మన్‌ పదవికి తన పేరును ప్రతిపాదించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ● దీనిపై ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే ఆయన రంగంలోకి దిగినట్లు వారు పేర్కొంటున్నారు. ● మరోవైపు నియోజకవర్గంలో ఉన్న అన్ని సంఘాలకు జువ్వాడి నర్సింగరావు ప్రతిపాదనలు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ● ఏడు సంఘాలకు రెండు వర్గాలు పోటీ పడుతుండడంతో వాటికి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్‌ పెద్దలకు తలనొప్పిగా మారింది. ● నియోజకవర్గ ఇన్‌చార్జినైన తనకే అన్ని సంఘాలకు చైర్మన్‌, డైరెక్టర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని నర్సింగరావు పట్టుబడుతుండగా.. పార్టీకి తాను అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని సుజీత్‌రావు కోరుతున్నారు. ● నియోజకవర్గంలో కీలకమైన మెట్‌పల్లి సహకార సంఘం చైర్మన్‌ పదవి వ్యవహారం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. ఈ పదవికి నర్సింగరావు ప్రస్తుత వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ అంజిరెడ్డి పేరును ప్రతిపాదిస్తే.. సుజీత్‌రావు కాంగ్రెస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు జెట్టి లింగం పేరును సిఫారసు చేసినట్లు తెలిసింది. ● మొదటి నుంచి జువ్వాడికి ప్రధాన అనుచరుడిగా ఉన్న జెట్టి లింగం.. మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఆయనతో విభేధించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ● జువ్వాడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న లింగం పేరును సుజీత్‌రావు ప్రతిపాదించడంపై ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

మెట్‌పల్లి: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవులను దక్కించుకోవడానికి కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కొన్ని సంఘాలకు అటు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ జువ్వాడి నర్సింగరావు, ఇటు పీసీసీ డెలిగేట్‌ కల్వకుంట్ల సుజీత్‌రావు వేర్వేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఈ ఇరువురు నేతలు తమ అనుచరులకు పదవులను కట్టబెట్టడానికి ఎవరి స్థాయిలో వారు ప్రభుత్వ పెద్దల వద్ద పావులు కదుపుతున్నారు. దీంతో ఇవి ఏ వర్గానికి దక్కుతాయన్నది కాంగ్రెస్‌లో ఆసక్తి రేపుతోంది.

ఏడు సంఘాలపై సుజీత్‌రావు పట్టు

అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ

జువ్వాడి అనుచరుడి పేరును

ప్రతిపాదించిన సుజీత్‌రావు

పలు సంఘాలకు నర్సింగరావు, సుజీత్‌రావు వేర్వేరుగా ప్రతిపాదనలు

తమ అనుచరులకు కట్టబెట్టడానికి ఇరువురు నేతల పావులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement