ఢిల్లీ సైన్స్‌ఫేర్‌ ఎగ్జిబిషన్‌లో కోరుట్ల విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సైన్స్‌ఫేర్‌ ఎగ్జిబిషన్‌లో కోరుట్ల విద్యార్థిని

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

కోరుట్లటౌన్‌: కోరుట్లలోని పీఎంశ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్‌.హిమానీ, గైడ్‌ టీచర్‌ నాగరాజు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించే 12వ జాతీయస్థాయి ఎన్‌ఎల్‌ఈపీసీ–2026 ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం వారు ఢిల్లీ చేరుకున్నారు. ఈనెల 14 వరకు ఎగ్జిబిషన్‌ జరుగుతుందని హెచ్‌ఎం వడ్లకొండ గంగాధర్‌ పేర్కొన్నారు. భూగర్భజలాల పునరుద్ధరణ, నదుల పునరుజ్జీవనం అనే సైన్స్‌ ప్రాజెక్టును ప్రదర్శించనున్నట్లు తెలిపారు. భూగర్భజలమట్టాలను పెంపొందించడం, వర్షం నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం, నదుల పునరుజ్జీవనానికి ఉపయోగపడే అంశాలను ప్రాజెక్ట్‌ ద్వారా వివరించనున్నట్లు గైడ్‌ టీచర్‌ చందా నాగరాజు వివరించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రవాసీలు కృషి చేయాలి

● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాయికల్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు గల్ఫ్‌ ప్రవాసీలు కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కోరారు. దుబాయిలో ఆదివారం ఈటీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సంజయ్‌తోపాటు ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగిందని, కేటీఆర్‌ ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు రైతు వేదికల్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

జగిత్యాలటౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం 11:30 గంటలకు నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌ను రైతు వేదికల్లో వీక్షించాలని, జిల్లా రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, పంటల సంరక్షణ, యాసంగి పంటల సాగు ప్రణాళిక అంశాలపై సీఎం మాట్లాడుతారని పేర్కొన్నారు. జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement