కోరుట్ల: జగిత్యాల జిల్లాలో పంటల సాగుకు శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన మంత్రి ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీ రమేశ్‌తో మాట్లాడి, నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సానుకూలంగా స్పందిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.


