స్వ‘శక్తి’ రథాలు | - | Sakshi
Sakshi News home page

స్వ‘శక్తి’ రథాలు

Oct 10 2026 12:58 AM | Updated on Oct 10 2026 12:58 AM

మహిళా స్వశక్తి సంఘాలకు ఆర్టీసీ బస్సులు జిల్లాలో 18 మండల సమాఖ్యలకు 18 బస్సులు కొత్త బస్సుకు సెర్ప్‌ నుంచి రూ.30 లక్షల నిధులు మండల మహిళా సమాఖ్య నుంచి రూ.6 లక్షలు

జగిత్యాల రూరల్‌: గ్రామీణ మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు అప్పగిస్తోంది. తద్వారా అదనపు ఆదాయానికి తోడ్పాటు అందుతోంది. ఇప్పటికే సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తోంది. ఏటా విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని అప్పగించారు. అద్దె బస్సుల పథకం కింద సెర్ప్‌ నుంచి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయగా, ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మండల మహిళా సమాఖ్యలకు వెసులుబాటు సమకూరింది. మహిళా సమాఖ్యల నుంచి తమ వాటా కింద రూ.6 లక్షలు భరిస్తే బస్సు యజమానులుగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. వీటిని ఆర్టీసీ 84 నెలల పాటు లీజుకు తీసుకుని ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఇక ఈ బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చులు సైతం సంస్థనే భరిస్తుండటంతో వరంగా మారింది. ఈ మొత్తం మండల మహిళా సమాఖ్య ఖాతాలో నేరుగా జమ అవుతుండటంతో అవసరమైన సభ్యులకు అత్యవసర సమయంలో కావాల్సిన రుణం ఇస్తూ ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement