ఉమ్మడి జిల్లాలో 130మంది మిల్లర్లకుపైగా సీఎంఆర్ ఎగవేతదారులు
ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు
డీ ఫాల్టర్లలో తీవ్ర అలజడి
ఇప్పటివరకు రూ.89.54 కోట్లు వసూలు
టెండర్ ధాన్యం బకాయిల వసూళ్లలో పురోగతి
మిల్లర్ల బకాయిలు
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 22,122 టన్నులకు సంబంధించి రూ.54.18 కోట్లు, జమ్మికుంట మండలం కోరపల్లి మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 19.860 టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.49.83 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ రెండు మిల్లులను అప్పట్లో బండారు మారుతి ఆయన భార్య పేరిట లీజుకు తీసుకున్నారు. తమవి కాని మిల్లులను చూపి రూ.105 కోట్ల విలువైన ధాన్యం తీసుకుని మొత్తం దారి మళ్లించారు. ఈ మొత్తానికి పెనాల్టీ, వడ్డీ కలిపితే రూ.130 కోట్ల మేర సర్కారుకు రావాల్సి ఉంది. బండారి మారుతిపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోనూ రూ.30 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించినట్లు రామగుండం కమిషనరేట్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
పెద్దపల్లి
కరీంనగర్
మొత్తం
సిరిసిల్ల
జగిత్యాల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిలర్ల బకాయిలు పేరుకుపోయాయి. సుమారు 132 మంది మిల్లర్లు రూ.859 కోట్ల మేర బకాయిపడ్డారు. విజిలెన్స్ దాడులు నిర్వహించినా.. కేసులు నమోదు చేస్తున్నా డీఫాల్ట్ మిల్లర్లు స్పందించకపోవడంతో ప్రభుత్వం వారి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. ఆస్తుల జప్తు ప్రక్రియను చట్టబద్ధంగా నిర్వహించేందుకు అధికారులకు శిక్షణ కూడా ఇవ్వబోతుంది. దీంతో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలతోపాటు టెండర్ ధాన్యం డబ్బులు చెల్లించని ఎగవేతదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలంలో అన్ని సీజన్లలో కలిపి కరీంనగర్ జిల్లాలో 40 మిల్లుల నుంచి రూ.180 కోట్లు రావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో 38మిల్లుల నుంచి రూ.236 కోట్లు, జగిత్యాల జిల్లాలో 30 రైస్ మిల్లుల నుంచి రూ.220 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో 24 మిల్లుల నుంచి రూ.223 కోట్లు వసూలు కావాల్సి ఉంది.


