‘ఎస్‌ఐఆర్‌’ పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ పకడ్బందీగా చేపట్టాలి

Oct 6 2026 11:53 PM | Updated on Oct 6 2026 11:53 PM

జగిత్యాలరూరల్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఈ–రోల్‌ అబ్జర్వర్‌ బాల మాయాదేవి అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం నర్సింగాపూర్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. బీఎల్‌ఓలను కలిసి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఇంటింటి సర్వే, ఫారాల స్వీకరణ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ హకీమ్‌, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జగిత్యాల: అనంతరం కలెక్టరేట్‌లో ఈఆర్వోలు, ఏఆర్వోలతో మాయాదేవి సమీక్షించారు. జనసంచారం ఉండే ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్‌, జివాకర్‌రెడ్డి, నర్సింహారావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం

జగిత్యాల: ఆర్టీసీ జగిత్యాల డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం మంగళవారం చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ బలపర్చుతున్న అభ్యర్థులను గెలిపించాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌ కోరారు. డిపో సెక్రటరీ నరేందర్‌నాయక్‌, వాసు, వినయ్‌, రాజన్న, సందీప్‌, రమణ, లచ్చన్న పాల్గొన్నారు.

విద్యుత్‌ వినియోగదారులపై భారం వేయొద్దు

జగిత్యాల: విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ట్రూఅప్‌ నెపంతో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసే నిర్ణయం సరికాదన్నారు. ఎల్‌నినో ప్రభావం, బొగ్గు సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సమస్య ఉత్పన్నమైందన్నారు.

సైబర్‌క్రైం ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలి

జగిత్యాలక్రైం: సైబర్‌ నేరాలపై వచ్చే ఫిర్యాదుకు తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్‌ నేరాల దర్యాప్తు, కేసుల పురోగతిపై పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన సైబర్‌ కేసులను సీఐలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్‌ ఆధారాలు వినియోగించాలన్నారు. ఈనెలను జాతీయ సైబర్‌ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సీఐలు రామ్‌ నరసింహారెడ్డి, సుధాకర్‌, కరుణాకర్‌, సురేశ్‌బాబు, లక్ష్మీనారాయణ, సైబర్‌ క్రైం సీఐ కృష్ణమూర్తి, ఎస్సైలు కృష్ణ, దినేశ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement