కేజీబీవీలకు బెడ్లు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలకు బెడ్లు

Oct 6 2026 11:53 PM | Updated on Oct 6 2026 11:53 PM

● విద్యార్థినులకు తీరనున్న కష్టాలు ● జిల్లాలో 16 కేజీబీవీలు ● 3,671 మంది విద్యార్థినులు

కథలాపూర్‌లో బాలికల

విద్యాలయం

వెల్గటూర్‌కు కొత్తగా వచ్చిన బెడ్లు ఇవే

కథలాపూర్‌(వేములవాడ): కస్తూరిభా గాంధీ బాలి కల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కష్టాలు తీరనున్నాయి. ఇన్నాళ్లు విద్యార్థినులు నిద్రించేందుకు చాపలు, కార్పెట్లు పరుచుకొని కాలం వెల్లదీశారు. నేలపై నిద్రించడంతో చలికాలంలో చలి, వర్షకాలంలో తేమతో అనారోగ్య సమస్యలు తలెత్తే వి. ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని కేజీబీవీలకు ప్రభుత్వం బెడ్లు (మంచాలు) సరఫరా చేస్తోంది.

16 కేజీబీవీలు.. 3,671 మంది విద్యార్థినులు

జిల్లాలో 16 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 14 సొంత భవనాల్లో.. రెండు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 3,671 మంది చదువుతున్నారు. వీరికి ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నారు. ప్రస్తుతం సొంత భవనాలున్న 14 కేజీబీవీలకే బెడ్లను ప్రభుత్వం సరఫరా చేసింది.

విద్యార్థినుల్లో సంతోషం

కేజీబీవీల్లో వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. విద్యార్థినులకు చదువుతోపాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్‌ బాక్సులు, యూనిఫామ్స్‌, నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, షూలు అందించారు. విద్యార్థినులు నిద్రించేందుకు వీలుగా ప్రస్తుతం బెడ్లు సరఫరా చేస్తుండటంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement