కోరుట్ల: పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో ధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఙంలో భాగంగా ఆదివారం మహాపురాణ ప్రవచన సప్తాహం నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం ఆస్థానపౌరాణికులు, గర్రెపల్లి మహేశ్వర శర్మ ప్రవచనాలు ఇచ్చారు. కాంతిని ప్రసాదించి కాపాడే సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవమన్నారు. ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మంచాల జగన్, అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చిద్రాల నారాయణ, బట్టు హరికృష్ణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పడిగెల శ్రీనివాస్, నిర్వాహకులు మంచాల రాజలింగం పాల్గొన్నారు.


