ఆలకించండి.. పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. పరిష్కరించండి

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయించండి ప్రవాహాన్ని మళ్లిస్తున్నారు ఎఫ్‌టీఎల్‌ హద్దులు పెట్టండి కోళ్ల ఫాంతో ఇబ్బంది పడుతున్నం

మాది కొడిమ్యాల. మా అత్తామామకు ఇద్దరు కొడుకులు. మామ మల్లయ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. ఇల్లు నా భర్త శ్రీనివాస్‌కు.. బావ రమేశ్‌కు ఉద్యోగం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. బావ రమేశ్‌ విద్యుత్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. నా భర్త ఇటీవల క్యాన్సర్‌ బారిన పడి చనిపోయాడు. మా ఇంటిని నా కూతురు పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని రమేశ్‌ను కోరితే పట్టించుకోవడం లేదు. గ్రామపెద్దల పంచాయితీకి పిలిచినా రావడం లేదు. ఇల్లు తప్ప నాకు ఎలాంటి ఆధారమూ లేదు. ఇంటిని నా కూతురు పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేలా చూడండి.

– కానవేని గీతాంజలి, కొడిమ్యాల

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అర్జీలు స్వీకరించారు. సమస్యలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీపీవో మదన్‌మోహన్‌, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు.

– గోవిందుల సత్యనారాయణ, తదితరులు

జగిత్యాలరూరల్‌ మండలం తిమ్మాపూర్‌ శివారు ప్రభుత్వ భూమి మీదుగా వెళ్లే ఒర్రె ప్రవాహాన్ని మళ్లించారు. మట్టి పోసి ప్లాట్లు చేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఒర్రె ప్రవాహానికి పంట పొలాలు కొట్టుకుపోతున్నాయి. సర్వేయర్‌కు ఫిర్యాదు చేయగా ఒర్రెకు హద్దులు ఏర్పాటు చేశారు. వాటిని అక్రమార్కులు తొలగించి కబ్జా చేస్తున్నారు. ఒర్రె పారకాన్ని యథాస్థితిలో కొనసాగించేలా చూడండి.

– మోతె మత్య్సకారులు

జిల్లాకేంద్రానికి ఆనుకుని ఉన్న మోతె పెద్ద చెరువుపై ఆధారపడి 125 మత్య్సకార కుటుంబాలు జీవిస్తున్నాయి. కబ్జాదారులు చెరువులో మట్టిపోస్తూ చదును చేస్తూ రోజుకు కొంత చొప్పున ఆక్రమిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ హద్దులు ఏర్పాటు చేయండి.

రాపల్లిలో మా ఇళ్లకు అతి సమీపంలో బాయిలర్‌ కోళ్లఫాం ఉంది. దుర్వాసన, ఈగలతో ఇబ్బంది పడుతున్నం. వంద మీటర్లలోపే ఉన్న ఈ కోళ్ల ఫాం కారణంగా వాంతులు, విరోచనాలతో పిల్లాపాపలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నాం. కోళ్లఫాంను దూరంగా తరలించి మా ఆరోగ్యానికి భరోసా కల్పించండి.

– మతులాపురం అంజయ్య, రాపల్లి

Advertisement
 
Advertisement
Advertisement