తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య
సారంగాపూర్: తల్లి మందలించిందని బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాడ మధుమిత (15) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఉంచిన రూ.వెయ్యి తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకుంది. దీంతో తల్లి జమున మందలించడంతో మనస్తాపంతో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి ఆమెను కిందికి దింపి ప్రాథమిక చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. బాలిక తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువతికి గాయాలు
మల్యాల: మండలంకేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు, ఎలక్ట్రిక్ స్కూటీ ఎదురెరుదుగా ఢీకొన్న సంఘటనలో స్కూటీపై ఉన్న యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల డిపో బస్సు పెగడపల్లి వైపు వెళ్తూ.. సాయిబాబా గుడి సమీపంలోకి చేరుకుంది. అదే సమయంలో తాటిపల్లికి చెందిన పంబాల శృతి ఎలక్ట్రిక్ స్కూటీపై వస్తోంది. మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో స్కూటీ బస్సు ముందు టైరుకిందకు దూసుకుపోయి శృతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108లో జగిత్యాల అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.


