సౌకర్యాలు మరిచి.. ధరలు పెంచి.. | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు మరిచి.. ధరలు పెంచి..

Nov 6 2025 8:22 AM | Updated on Nov 6 2025 8:22 AM

సౌకర్యాలు మరిచి.. ధరలు పెంచి..

సౌకర్యాలు మరిచి.. ధరలు పెంచి..

● కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా విరాళం అందించే భక్తులకు అందనంత దూరంలో శాశ్వత అభిషేకాన్ని రూ.1,116 నుంచి రూ.10,116కు పెంచడంతో ఇకపై స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం తగ్గిపోనుంది. ● ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన సుప్రభాత సేవ, వడమాల భోగం, మన్యసూక్త హోమం, నిగ్రహ పీడ నివారణ పూజల ధరలు ఇష్టారీతిన పెంచడంతో నిరుపేద భక్తులకు సేవలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. ● అంతరాలయ పూజ టికెట్‌ ధర రూ.400 నుంచి రూ.800కు పెంచడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రతి మంగళవారం, శనివారాల్లో మినహా మిగిలిన రోజుల్లో తగ్గిపోయే ప్రమాదం ఉంది. ● కొండగట్టు అంజన్న స్వామి సన్నిధికి మెట్లదారిన వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ● మెట్లదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. పైపులైను లీకేజీతో మెట్లు బురదమయమైపోతున్నాయి. మెట్లదారి అపరిశుభ్రంగా మారడంతో చాలామంది భక్తులు ఆ దారి మీదుగా వెళ్లేందుకు సాహసించడం లేదు. ● అంజన్న సన్నిధిలో నిద్రిస్తే శని నివారణ తొలగిపోతుందని, మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామి సన్నిధిలో 11 రోజులు, 21 రోజులు నిద్రించేందుకు వచ్చే భక్తులకు కనీస వసతులు లేవు. ● కొండగట్టులో మారుతి నిలయం వసతిగృహం శిథిలావస్థకు చేరింది. రూ.300 అద్దెప్రాతిపదికన 20 గదులు, రూ.700 ప్రాతిపదికన 10గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండగట్టులో నిద్రించేందుకు గదులు లభించక దిగువ కొండగట్టులో ప్రైవేట్‌ వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారు. ● కొండగట్టులో సులభ్‌కాంప్లెక్స్‌లు వై జంక్షన్‌, సాగర్‌ అతిథి గృహం వద్ద, సాన కాటేజీ వద్ద ఉన్నాయి. మెట్లదారిలో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ వినియోగంలో లేకపోవటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● దూరప్రాంతాల నుంచి కొండగట్టుకు వచ్చే భ క్తులు గతంలో వాహనాలు పార్కింగ్‌ చేసే స్థలంలో భక్తుల నీడ కోసం షెడ్డు నిర్మాణం చేపట్ట డంతో పార్కింగ్‌ కోసం ఇబ్బందిపడుతున్నారు. ● భక్తులు అంజన్న స్వరూపంగా భావించే వానారాలు భక్తుల చేతుల్లోని ప్రసాదాలు, బ్యాగులు, ఫోన్లు లాక్కెళ్తుండడంతో మానసికంగా తీవ్ర వేదన చెందుతున్నారు. ● కోనేరు, ఆలయ పరిసరాల్లో భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించకపోవటంతో భక్తులు కోనేటి వద్ద స్నానమాచరించేందుకు, చేతుల్లో సెల్‌ఫోన్లు, ప్రసాదం తీసుకెళ్లటానికి జంకుతున్నారు. ● కొండగట్టు ఆలయ ప్రాశస్త్యం వివరించే బోర్డులు ఏర్పాటు చేయకపోవటంతో కొండగట్టుకు మొదటిసారి వచ్చే భక్తులు క్షేత్రపాలకుడు బేతాళస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలనే విషయంపై అవగాహన కొరవడుతోంది. ● నూతన వాహనాలు కొనుగోలు చేసిన భక్తులు స్వామివారి సన్నిధిలో వాహన పూజ చేసుకుంటే వారికి స్వామివారి ఉచిత దర్శనం కల్పించాలనే ఏళ్లనాటి విన్నపాలను అధికారులు పట్టించుకుంటున్న పాపానపోవటం లేదు. ● ప్రతి మంగళ, శనివారాల్లో అధిక సంఖ్యలతో వచ్చే భక్తులతో వాహనాలు పార్కింగ్‌ చేసుకునేందుకు స్థలం అందుబాటులో లేకపోవడంతో దూరంగా పార్కింగ్‌ చేయడం ద్వారా వృద్ధులు, చిన్నారులు ఆలయానికి నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ● ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు లేవు. నిరుపేద భక్తులు టికెట్లు కొనలేక.. ధర్మదర్శనం క్యూలైన్లలో నిలబడలేక ఇబ్బంది పడుతున్నారు. ● 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేసి, స్వామివారి దర్శనం త్వరితగతిన కల్పించేందుకు ఆలయ అధికారులు తగు చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది.

కొండగట్టు అంజన్న దర్శనం భారం ఆదాయం పెంపుపై అధికారుల దృష్టి ఆర్జిత సేవల ధరలు పెంచుతున్నట్లు ప్రకటన ముందుగా వసతులు కల్పించాలంటున్న భక్తులు

మల్యాల: నిరుపేదల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారమై.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న దర్శనం ఇకపై భక్తులకు భారం కానుంది. ఆర్జిత సేవల ధరల పెంపుతో భక్తుల జేబుకు చిల్లుపడనుంది. వసతుల కల్పనపై దృష్టి సారించకుండా.. ఆదాయం పెంపు కోసం ధరలు పెంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు ఆలయానికి నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళ, శనివారాల్లో మరింత అధికం.

సామాన్యులకు స్వామివారు మరింత దూరం..

కల్పించాల్సిన సౌకర్యాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement