జగిత్యాలరూరల్/ధర్మపురి/వెల్గటూర్/పెగడపల్లి: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని శ్రీపౌలస్తేశ్వరస్వామి దేవాలయం, సహస్ర వెయ్యి లింగాల దేవాలయం, లక్ష్మీపూర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణి దీపాల కాంతుల్లో మెరిసింది. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు పాల్గొన్నారు. కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో గంగాహారతి కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పెగడపల్లిలోని రాజన్న ఆలయంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
పగడపల్లి: ఆలయంలో దీపాలకాంతులు
జగిత్యాలరూరల్: పొలాస పౌలస్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
ధర్మపురి :దీపాల కాంతుల్లో నృసింహుని కోనేరు
ఆలయాలకు ‘కార్తీక’శోభ
ఆలయాలకు ‘కార్తీక’శోభ
ఆలయాలకు ‘కార్తీక’శోభ


