
చదువుతోనే మహిళా సాధికారత సాధ్యం
వెల్గటూర్: ఉన్నత చదువులతోనే మహిళా సాధికారత సాధ్యమని మహిళా సాధికారత కేంద్ర జెండర్ స్పెషలిస్ట్ స్వప్న అన్నారు. మండలంలోని స్తంభంపల్లి బీసీ బాలుర గురుకుల హాస్టల్ విద్యార్థులకు బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా అంకురం కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగ వివక్ష, లింగ సమానత్వం ప్రాముఖ్యతను వివరించారు. ఆడపిల్లలకు ఉన్నత చదువులతో కలిగే ప్రయోజనాలను వివరించారు. మహిళల హక్కులు, చట్టాలపై, పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్‌లైన్ సర్వీసెస్, సఖీ కేంద్రంలో అందించే సేవలు, సైబర్ నేరాలు, యాంటీ హూమన్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ హరిత, కేంద్రం బృందం సభ్యులు స్వప్న, గౌతమి, సఖీ కేంద్రం వర్కర్ భాగ్యలక్ష్మి, తేజస్ ఫౌండేషన్ మెంబర్ రాధ, ఉపాధ్యాయులు రాజ్‌కుమార్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీ లక్ష్మి తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీలుగా.. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

చదువుతోనే మహిళా సాధికారత సాధ్యం