కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి | - | Sakshi
Sakshi News home page

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి

Jul 30 2025 6:54 AM | Updated on Jul 30 2025 6:54 AM

కాకతీ

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి

● మంత్రికి ఎమ్మెల్యే సంజయ్‌ విజ్ఞప్తి

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఎస్సారెస్పీలోకి నీరు చేరుతుండడంతో కాకతీయ కాలువకు విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి లేఖ ద్వారా కోరారు. ప్రాజెక్టులో మంగళవారం వరకు 33టీఎంసీల నీరు చేరిందని, ఆ నీటితో ఆన్‌, ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎగువప్రాంతాల నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని కోరారు.

ఎస్సారెస్పీకి 67,401 క్యూసెక్కుల వరద నీరు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాకు సాగు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం 67,401 క్యూసెక్కులు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 734 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1076.30 అడుగులు కాగా.. ప్రస్తుతం 35.777 టీఎంసీలుగా ఉంది.

గురుకులం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం

రాయికల్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి ఆనందరావు అన్నారు. రాయికల్‌ మండలం సింగరావుపేటలోని మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో మంగళవారం సభ్యత్వ నమోదు చేపట్టారు. గురుకులం, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని, హెల్త్‌ స్కీం వర్తించేలా చూస్తామని పేర్కొన్నారు. పాఠశాలల పనివేళల్లో మార్పునకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదించారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్‌కు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పొన్నం రమేశ్‌, కార్యదర్శి వసంతరావు, మండల అధ్యక్షుడు గంగరాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య పాల్గొన్నారు.

ఘనంగా శ్రావణ సప్తాహం

మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రావణ సప్తాహం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం గావించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు భజనలు చేశారు. అర్చకు ల పూజలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి కి శావ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

భూపతిపూర్‌లో కేంద్ర బృందం

రాయికల్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా రాయికల్‌ మండలంలోని భూపతిపూర్‌ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు మధుకర్‌ సందర్శించారు. గ్రామంలోని చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీవో చిరంజీవి ఉన్నారు.

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి
1
1/3

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి
2
2/3

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి
3
3/3

కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement