
ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల వసంతోత్సవానికి రండి
● సీఎంను కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
● ఆడిటోరియం, ఉమెన్స్, మెన్స్ హాస్టల్ మంజూరివ్వాలని వినతి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని పురాతన ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) కళాశాల 60వసంతాల వేడుకకు రావా లని సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆహ్వానించారు. కళాశాలలో ఆడిటోరియం, ఉమెన్స్, మెన్స్ హాస్టల్ మంజూరు చేయాలని కోరారు. 32 ఎకరాల్లో నిర్మితమైన ఈ కళాశాలలో ఎంతోమంది చదువుకుని ప్రముఖులయ్యారని గుర్తు చేశారు. కండ్లపల్లి రెసిడెన్షియల్ స్కూల్, బస్‌షెల్టర్, ప్లేగ్రౌండ్, శానిటరీకి సంబంధించి డైనింగ్‌హాల్, జిమ్ ఏర్పా టు చేయాలని కోరారు. స్పందించిన సీఎం వేడుకలకు వస్తానని, పనుల మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్కొన్నారు.