
రైతులు ఆయిల్‌పాం సాగు చేయాలి
మల్యాల: రైతులు ఆయిల్ పాం సాగు చేయాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్యాం ప్రసాద్, డీఏవో భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ పాం విస్తరణపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ పాం సాగు వివరాలు, రాయితీ, పంట మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. మూడెకరాలకుపైగా భూ మి ఉన్న రైతులు ఆయిల్ పాం సాగు చేపట్టాలని, ప్రతి నెలా దిగబడితోపాటు అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతోపాటు కోతుల బెడద లేని పంట అని పేర్కొన్నారు. ఎకరాకు ఏటా రూ.1.50లక్షల ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ పాం సాగు చేస్తున్న రైతు కెంద అంజయ్య తోటను పరిశీలించారు. ఏవో కె.చంద్రదీపక్, లోహియా కంపెనీ ప్రతినిధి అనిల్, ఏఈఓ కారుణ్యకుమార్, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు డీఏవో భాస్క ర్ మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. లైసెన్సులు, బిల్లులను పరిశీలించారు. ఈపీఏఎస్ ద్వారానే ఎరువులు విక్రయించాలని సూచించారు.