
రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఇబ్రహీంపట్నం: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం మండలంలోని 13 గ్రామాల్లో 42మందికి రూ.42,04,8 72 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. వర్షాలు పడుతున్నందున గ్రామాలకే వెళ్లి చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో యూరియా కూడా సరిగ్గా అందించలేకపోతోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం కేంద్రం యూరి యా సరఫరా చేస్తోందని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకరిపైనొకరు నెపం నెట్టుకుంటూ రైతుల ను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఎరువుల కోసం లైన్ కట్టలేదని, ఇప్పుడు బస్తా కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశా రు. మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ ఎలేటి చిన్నారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి, నాయకులు నేమూరి నరేష్, జేడీ సుమన్, కమటం రమేశ్, రెబ్బటి రాజేందర్ పాల్గొన్నారు.
కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి
రోడ్డు పనులు చేయని కంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎమ్మెల్యే ఆర్‌అండ్‌బీ ఏఈ ఫయజన్‌ను ఆదేశించారు. మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పెద్ద గుంతలు పడి రోడ్డుపై నిలిచిన నీటిని చూసి ఆగారు. గ్రామ పంచాయతీ అధికారులు బ్లేడ్ ట్రాక్టర్‌తో చదును చేయిస్తుండడంతో గుంతలు ఎందుకు పూడ్చలేదని ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాక పనులు ఆపివేశాడని వారు సమాధానం ఇవ్వడంతో సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్