
భారతీయుడి త్రీడీ కళకు దక్కిన గౌరవం
రామగిరి(మంథని): అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, మెకానికల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌ఆర్ కృష్ణ ఆధునిక పద్ధతులు ఉపయోగించి సృష్టించిన 10 త్రీడి డిజైన్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూకే(యునైటెడ్ కింగ్‌డమ్)కు చెందిన అధికారిక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్ ఆఫీస్ ఈ 10 త్రీడీ డిజైన్స్ పేటెంట్ హక్కులను కృష్ణ పేరిట నమోదు చేసింది. దాదాపు 14ఏళ్ల నుంచి తాను త్రీడీ కళపై చేస్తున్న కృషికి గుర్తింపుగా యూకే పేటెంట్ హక్కులు రావడం గర్వంగా ఉందని కృష్ణ తెలిపారు. భారతదేశంలో పుట్టిన అనేక సాంకేతిక విజ్ఞానశాస్త్రాల్లో త్రీడీ కళ కూడా ఒకటని, ఈ విజయానికి ఆదినుంచీ సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్, మెకానికల్ ప్రొఫెసర్ శ్రీధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, తోటి ఉద్యోగులకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.